Breaking News

కైకలూరు పట్టణంలో 1420 మందికి ఫెన్షన్లు ఉండగా నూతనంగా మరో 72 మందికి మంజూరు చేసి నేడు 1లక్ష 42 వేలు రూపాయలు అందించాం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలని, మీ తరుపున, నా తరుపున ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ గారి కార్యాలయం వద్ద పంచాయతీ ఈవో . లక్ష్మినారాయణ కలసి నూతనంగా మంజూరు చేసిన 72 మందికి ఫెన్షన్లు ఎమ్మేల్యే డిఎన్ఆర్ అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలకు 21 ఎంపీటీసీలు, అదేవిదంగా జడ్పీటీసీ అత్యంత మెజార్టీతో గెలిపించిన మీకు ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అలాగే ఈ రోజు ప్రజాప్రతినిధులుగా, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పరిపాలనలో మనం పని చేయడం మన అందరి అదృష్టమని, ప్రజల ఆశీస్సులతో గెలిచిన మీరు అందరూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలని, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎపిటీసీ లను సూచించారు. అదేవిదంగా జగనన్న సైన్యం, గ్రామ వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రతి సంక్షేమ పధకాన్నికి అర్హులు అయినా వారి పేర్లు ఎప్పటికి అప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కైకలూరు పట్టణంలో 1420 మందికి ఫెన్షన్లు ఇస్తున్నామని, ఈ రోజు మరో 72 మందికి నూతన ఫెన్షన్లు 1లక్ష 42 వేలు రూపాయలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే మీ ఇంటికి వచ్చి ఫెన్షన్ ఇచ్చే వ్యవస్థ తెచ్చి దేశ వ్యాప్తంగా కీర్తిని అందుకున్నాఅందుకున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పధకం కూడా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారని, ఎక్కడ అవినీతికి తావులేకుండా, వాలంటరీలు, సచివాలయం ఉద్యోగుల ద్వారా అర్హులు అయిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు ఇస్తున్నారన్నారు. అగ్రకులాలలోని అర్హులైన పేద అక్కచెల్లమ్మలకు ఈ నెలాఖరికి ఈబీసీ పధకం ద్వారా 45 ఎళ్లు నిండిన అక్కచెల్లమ్మలకు లబ్ది ఇవ్వడం జరుగుతుందనన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఎంపిపి అడివి కృష్ణ మాట్లాడుతూ పెన్షన్ తీసుకోవడం కోసం పంచాయితీ కార్యాలయం వద్ద పడిగాపులు పడే అవస్థను తొలగించి గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు వ్యవస్థను తెచ్చి సూర్యోదయానికి ముందే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్న ఘనత మన సీఎం జగనన్నదే అన్నారు.జగనన్న పిలుపు ను అందిపుచ్చుకుని నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న గౌరవ ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలువుతున్నాన ఆయన అన్నారు. సర్పంచ్ డీయం నవరత్న కుమారి మాట్లాడుతూ జగనన్న పాలనలో శాసనసభ్యులు డీఎన్ ఆర్ హయాంలో ప్రజాప్రతినిధులుగా తాము ఉండడం తమ అదృష్టం బావిస్తున్నామన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఎంపీటీసీలు, మంగినేని రామకృష్ణ, మూడెడ్ల శశికళ, తెంటు సత్యనారాయణ, సైదు లక్ష్మి, బోడావుల తిరుపతిరాజు, సాదు కొండయ్య,,నల్లగచ్చు ధనలక్ష్మి, సర్పంచ్ లు జయమంగళ కాసులు, చెరుకువాడ బలరామరాజు,ఘంటసాల శేషారావు,ఉలిసి వసంతకుమారి,కైకలూరు ఉప సర్పంచ్ మంగినేని పోతురాజు, నాయకులు నల్లగచ్చు బాబులు, నిమ్మల శ్రీనివాస్, నిమ్మల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *