-వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు నేరుగా ఆయా వసతి గృహ సంక్షేమాధికారిని సంప్రదించగలరు…
-విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-అసిస్టెంట్ బీసీ వెల్పేర్ అధికారిణి గురవమ్మ
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ డివిజన్ పరిధిలో 2021-2022 విద్యా సంవత్సరము నకు గాను ఫ్రీ మెట్రిక్ మరియు కళాశాలలో విద్యనభ్యశించే విద్యార్థులు బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశము అవకాశం కల్పించడబందిందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసకోవాలని బీసీ వెల్పేర్ అధికారి బీసీ వెల్పేర్ అధికారిణి కె. గురవమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డివిజన్ పరిధిలో మూడవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు 7 ఫ్రీ మెట్రిక్, ఇంటర్ మీడియట్ ఆపై కోర్సులు చదువుకునే వారు ఉండేందుకు 6 కళాశాల వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వసతి గృహాల్లో చేరేందుకు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని బీసీ వెల్పేర్ అధికారిణి గురవమ్మ ఆ ప్రకటనలో తెలిపారు.
డివిజన్ పరిదిలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని ఖాళీల వివరాలు :-
3 నుంచి 10 వరకు ఫ్రీ మెట్రిక్ చదుతున్న విద్యార్ధులకు గాను పెదపారుపూడి, గుడివాడ, మండవల్లి, కైకలూరు బాలుర వసతి గృహాల్లో ఒక్కోక్క వసతి గృహం నందు మొత్తం 100 చొప్పున ఖాలీలు ఉండగా ఇందులో బీలకు 75, ఎస్సీలకు 10, ఎస్టీలకు 6, ఇబీసీలకు 9 మంది విద్యార్థులు ఉండేందకు వసతి సౌకర్యాలన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ముదినేపల్లి బాలుర వసతి గృహం లో 69 ఖాలీల్లో బీలకు 59, ఎస్టీలకు 5, ఇబీసీలకు 7 మందికి, కొల్లేటికోట వసతి గృహంలో 53ఖాలీలకు గాను బీలకు 31, ఎస్సీలకు 10, ఎస్టీలకు 6, ఇబీసీలకు 6 మందికి, కలిదిండి బాలికలక వసతి గృహం నందు 74 ఖాలీలకు గాను బీలకు 63, ఎస్టీలకు 6, ఇబీసీలకు 8 మంది విద్యార్థులు ఉండేందకు వసతి సౌకర్యాలన్ని కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
కళాశాలల్లో ఇంటర్ మీడియట్ నుంచి ఆపై కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులుండేందుకు వసతి గృహాల వివరాలు :-
పెదపారుపూడి, గుడ్లవల్లేరు, కైకలూరులోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాల్లో ఒక్కోక్క వసతి గృహంలో 100 చొప్పున ఖాలీలు ఉన్నాయన్నారు. ఇందులో బీసీలకు 75, ఎస్సీలకు 10, ఎస్టీలకు 9, ఇబీసీలకు 9 చొప్పున ఇవ్వడం జరగుతుందన్నారు. అదేవిధంగా బాలికలకు ప్రవేశము కొరకు గుడ్లవల్లేరు, కైకలూరుల్లోని వసతి గృహాల్లో ఒక్కొక్క వసతి గృహంలో 100 చొప్పున ఖాలీలు ఉన్నాయన్నారు. ఇందులో బీసీలకు 75, ఎస్సీలకు10, ఎస్టీలకు 9, ఇబీసీలకు 9 చొప్పున ఇవ్వడం జరగుతుందన్నారు. అంగలూరు వసతి గృహంలో 86 ఖాలీలకు గాను బీసీలకు 71, ఎస్టీలకు 6, ఇబీసీలకు 9 మందికి ఉండేందుకు వసతిని కల్పించడం జరగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థులు వసతి గృహాల్లోని ఖాలీ వివరాలను తెలుసుకునేందుకు ఆయా వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోన్లు వివరాలను ఈ విధంగా తెలియజేయడమైనది. ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహాలు పెదపారుపూడి, గుడివాడ 9989961799 నెంబర్ కు, ముదినేపల్లి, కొల్లేటి కోట, మండవల్లి 9652697443 కు కైకలూరు 491546349 కు బాలికలల వసతి గృహం కలిదిండి 9298702787 ఫోన్ నెంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.
అదేవిధంగా కళాశాల విద్యార్థులు ప్రవేశము కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు వివరాలు : -బాలుర వసతి గృహం పెదపారుపూడి 9989961799 కు గుడ్లవల్లేరు 9704657098కు కైకలూరు 9491546349 కు, బాలికల వసతి గృహం కొరకు గుడ్లవల్లేరులో 9963362929 కు కైకలూరు 9298702787కు గుడ్లవల్లేరు మండలం అంగలూరులో 9133567239 కు ఫోన్ చేసి ఖాలీల వివరాలను సంప్రదించవచ్చునని అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారిణి గురవమ్మ ఆ ప్రకటనలో తెపారు.