Breaking News

ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు  చేసిన సేవలు చిరస్మరణీయం…

ఏలూరు , నేటి పత్రిక ప్రజావార్త :
సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మీ తండ్రి  రంగారావు మృతి పార్టీకి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులో ని ఆయన స్వగృహంలో పిళ్ళంగోళ్ళ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏలూరు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు  చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి ని, కుటుంబీకులను కలసి విచారం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సానుభూతిని తెలిపి, పరామర్శించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *