నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు మండలంలో కొత్తగా 620 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నామని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హామీ ఇచ్చారు. నూజివీడు మండలంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్దిదారులకు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం పెన్షన్ మంజూరు పత్రాలను , పెన్షన్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తామన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పధకాలు అందించడమే తప్ప అర్హులను తొలగించే పనిని తమ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని స్పష్టం చేసారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందిస్తామని, ఈ విషయంలో లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని నిరుపేదలు, ఎటువంటి ఆధారంలేని వృద్దులు,విభిన్న ప్రతిభావంతులు, వితంతువులకు అందవలసిన సామజిక పెన్షన్లలో అనర్హులను తొలగిస్తున్నారన్నారు. ఈ -కే వై.సి కి ఈ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇచ్చిందన్నారు. వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ఈ -కే వై.సి ని సంబంధిత వాలంటీర్లు చేస్తారన్నారు. అర్హులైనవారెవరికీ పెన్షన్ లు తొలగించడం జరగదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నూజివీడు మండలంలో కొత్తగా పెన్షన్ మంజూరు చేసిన 620 మంది లబ్దిదారులకు అక్టోబర్,1వ తేదీ నుండి పెన్షన్ అందించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో జెడ్ పి వైస్ చైర్మన్ కృష్ణంరాజు ఎంపిపి ఆరేపల్లి శిరీష ఎంపీడీవో జి రాణి, నూజివీడు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన పింఛన్ లబ్దిదారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …