గుడివాడ పట్టణంలోని 1370 డ్వాక్రా సంఘాల్లోని 12,798 మంది సభ్యులకు రూ. 10.58 కోట్లు పంపిణీ…

-వైస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషణ్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఆసరా కల్పిస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు, దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు.
స్థానిక 8 వ వార్డు మున్సిపల్ పాఠశాలలో సోమవారం డ్వాక్రా మహిళలకు స్థానిక ప్రజాపత్రినిధులు, పురపాలక సంఘ అధికారులతో కలసి ఆసరా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగుడివాడ పట్టణంలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మంచేందుకు రాష్ట పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని కృషి చేసారన్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలోఇప్పటికే అర్హులైన వారందరికీ ఇళ్లు పట్టాలు అందించండం జరిగిందని త్వరలో జీ ప్లస్ త్రీ ఇళ్లను కూడా లబ్దిదారులకు అందిస్తామన్నారు. మహిళలను ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలైన అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా , చేయూత, వంటి పథకాలతో పాటు రాష్ట్రంలో 30 లక్షల మంది పేదల ఇళ్ల పట్టాలను అందించారన్నారు. సాదారణ ఎన్నికలు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు అన్ని స్థాయిలలో మహిళలకు 50 శాతం పైగా సీట్లు అందించి మహిళాభివృద్ది పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని తన పాదయాత్రలో డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారన్నారు. ఆరోజు డ్వాక్రా మహిళలకు ఉన్న డ్వాక్రా రుణాలను తాను అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలలో మాఫీ చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా రెండవ సంవత్సరం కూడా మహిళలకు ఆర్ధిక సహాయం అందించారన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా రెండవ విడతగా గుడివాడ పట్టణంలోని 1370డ్వాక్రా సంఘాల్లోని 12,798 మంది సభ్యులకు రూ. 10.58 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తానూ సీఎం గా బాధ్యతలు చేపట్టిన 6 నెలల సమయంలోనే పూర్తిగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదే నన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా మొదటి విఢతలో రూ. 6319 కోట్లు, రెండవ విడతగా 6440 కోట్లు మొత్తం రెండు విడతల్లో 12,759 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమచేసారన్నారు. గత ప్రభుత్వం హాయంలో స్వయం సహాయక సంఘాలకు రుణ మాఫీ అమలు చేయక పోవడంతో అప్పుల ఊభిలో కూరుకుపోయాన్నారు. ఏ గ్రేడ్ గా ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్ లకు దిగజారాయన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహళలకు ఇచ్చిన హామీలతో పూర్వ వైభవాన్ని నేడు డ్వాక్రా సంఘాలకు తెచ్చారన్నారు. గుడివాడ పట్టణంలో 4, నుంచి 11 వరకు గల వార్డులల్లోని 337 గ్రూపులకు రూ. 2.9 కోట్లు రెండో విడత వైఎస్సార్ ఆసరగా రుణ మాఫీ జరిగిందన్నారు.
మున్సిపల్ అసిసెంట్ కమీషనరు రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని రూపు మాపేందుకు అనేక చర్యలు చేపట్టిందన్నారు. మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ప్రభుత్వంజగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోక్లీన్ ఆంద్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి కుటుంబం తడి పొడి చెత్తను గ్రీన్ అంబాసిడర్లు అందించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచి వాయుకాలుష్యాన్ని అరికట్టాలన్నారు.
తొలుత నాగవరప్పాడు బీసీ హాస్టల్ లో 1,2,3,36 వార్డులకు సంబందించి ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు, గొర్ల శ్రీను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అబివృద్ది చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. ఈ దిశగా అన్నమాట ప్రకారం నేడు వైఎస్సార్ ఆసరా అందిస్తున్నారన్నారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసాను కల్పిస్తూ ఆసరాను సీయం జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెమ్మలకు అన్నగాతుమ్మనిగా ఆండగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో పట్టణ మెమ్మా సీయంయం శ్రీధర్, స్థానిక నాయకులు చింతల భాస్కరరావు, జోగా కిషోర్, ఆంజనేయ ప్రసాద్, శేఖర్, జాకబ్ రాజు,దారం నరశింహరావు,నేర్సు గంగాధరరావు, మాదాసు వెంకట లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *