ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త నినాదం

– ఎంఎంస్ఎంఈపై మంత్రి కొండ‌ప‌ల్లి సుదీర్ఘ స‌మీక్ష‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక కుటుంబంలో ఒక పారిశ్రామివేత్త‌ను త‌యారు చేయాల‌న్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యానికి అనుగుణంగా ఎంఎంస్ఎంఈ ప‌ని చేయాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లోని 8వ అంత‌స్తులో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్యాల‌యంలో ఎంఎస్ఎంఈపై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప‌నితీరుతో పాటు అమ‌లు చేస్తోన్న వివిధ ప‌థ‌కాల పురోగ‌తిపై చ‌ర్చించారు. కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఏపీ చీఫ్ మినిస్ట‌ర్స్ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఏపీ క్ల‌స్ట‌ర్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అమ‌లుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి చ‌ర్చించారు. ఎంఎంస్ఎంఈల‌కు కావాల్సిన అవ‌స‌రాలు తీర్చ‌డంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ఇండ‌స్ట్రీయ‌ల్ ప్ర‌మోష‌న‌ల్‌ అధికారిని నామినేట్ చేస్తామ‌ని.. వారు నియోజ‌క‌వ‌ర్గ విజ‌న్ ప్లాన్‌లో ప‌రిశ్ర‌మ‌ల కోసం ప‌నిచేసే సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుంటార‌ని మంత్రి తెలిపారు. ఈ విష‌యంలో ఆదేశాలు జారీ చేయాల‌ని డైరెక్ట‌ర్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్‌కు మంత్రి సూచించారు. ప్ర‌భుత్వ సంస్థ‌లు, కార్పొరేట్ సంస్థ‌ల నుంచి ఎంఎస్ఎంఈల‌కు రావాల్సిన బ‌కాయిలు డిలే అయితే పెస్టిలేష‌న్ కౌన్సెల్ ద్వారా ఓడీఆర్ పోర్ట‌ల్ ద్వారా అందుబాటులో ఉంచి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్‌ను ఆదేశించారు. ప్ర‌తి జిల్లాలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించే జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ఎక్స్‌పోర్ట్ ప్ర‌మోష‌న్ క‌మిటీ ముందు ఎంఎంస్ఎంఈను ప‌టిష్టం చేసేలా ఎజెండాలు త‌యారు చేయాల‌ని జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారుల‌కు సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు తయారు చేయాల‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ డైరెక్ట‌ర్‌కు సూచించారు. ఎంఎస్ఎంఈని ప‌టిష్టం చేసేందుకు గ్రామ‌, మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి హెచ్‌వోడీ వ‌ర‌కు అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి.. గౌర‌వ ముఖ్య‌మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను క‌లిసిక‌ట్టుగా ముందుకు తీసుకువెళ్లాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో సెక్ర‌ట‌రీ ఇండ‌స్ట్రీస్ డాక్ట‌ర్ ఎన్‌. యువ‌రాజ్‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్ శుభం బ‌న్సాల్‌, ఏపీ ఎంఎస్ఎంఈ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ సీఈవో విశ్వ‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అధికారులు మ‌రియు వివిధ జిల్లాల ప‌రిశ్ర‌మ‌ల అధికారులు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *