-మజ్జిగ, తాగునీరు తో ప్రజల దాహార్తి, అలసట ను తీరుస్తున్న సుజనా – సుజలా చలివేంద్రాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సుజనా – సుజల పేరిట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలలో చల్లని నీటి తో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. సుజనా చౌదరి కార్యాలయం రూపొందించిన సుజనా – సుజలా చలివేంద్రాలు ఆయా కూడళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గత 3 రోజులుగా నియోజకవర్గంలోని సితార సెంటర్, చిట్టినగర్ చిట్టి గారి పార్కు దగ్గర, నెహ్రూ బొమ్మ సెంటర్, పంజా సెంటర్ ముసాఫిర్ ఖానా దగ్గర, మల్లిఖార్జున పేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కింద, రథం సెంటర్ ఫ్లై ఓవర్ కింద, భవానీపురం శివాలయం సెంటర్, ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ. కార్యక్రమం చేపడుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పర్యవేక్షణలో స్తానిక సుజనా మిత్ర లు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎండలో పనులు చేసుకునే కార్మికులు, ముఠా కార్మికులు, పాద చారులు, వాహన చోదకులు , విద్యార్థులు ఈ చలివేంద్రాల వద్ద చల్లని నీటితో పాటు మజ్జిగ సేవించి అలసట నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు కోనియాడుతున్నారు.
Prajavartha Online Telugu News