-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సర్వేక్షన్ 2024 -25 సంవత్సరమునకు విజయవాడ నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ లీక్ సిటీగా అవార్డు ను అందుకున్నందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2025- 26 లో కూడా విజయవాడను ఉత్తమ స్థానంలో ఉంచేందుకు అభిప్రాయ సేకరణలో పాల్గొనాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలోని మీటింగ్ హాల్ లో శాఖాధిపతులు మరియు ప్రజారోగ్యం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2024 – 25 లో భారత దేశంలోనే అత్యున్నత స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అయినా సూపర్ స్వచ్ లీక్ సిటీగా దేశంలోని నాలుగు నగరాలలో విజయవాడ కూడా ఉత్తమ నగరంగా నిలిచినందుకు ప్రతి ఒక్కరి సహకారం వల్ల అది సాధ్యపడిందని ఈసారి 2025 -26 స్వచ్ఛ సర్వేక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు సహకరించి ప్రజలలో స్వచ్ఛ సర్వేక్షన్ అభిప్రాయ సేకరణను తెలిపి వారికి చైతన్యం పరచాలని కమిషనర్ అన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2025 -26 లో కేవలం 13 ప్రశ్నలు మాత్రమే ఉంటాయని, నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వ్యర్ధాల విభజన, రెడ్యూస్డ్ రీ యూస్ రీసైకిల్ సెంటర్లు మరియు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రధానంగా ఈ ప్రశ్నలు ఉన్నాయని, ఈ ప్రశ్నలన్నిటికీ ప్రజల అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షన్ 2025- 26 జరుగుతుందని వారు https://cf.sbmurban.org/ లింక్ ద్వారా వారి అభిప్రాయాలను తెలుపవచ్చని, ప్రజలకు తెలియపరచాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఉత్తమ స్థానం నిలబెట్టుకునేందుకు ప్రజల అభిప్రాయ సేకరణ ఎంతో ముఖ్యమని, ప్రజలు దీనికి సహకరించవలసిందిగా విన్నవించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విజయలక్ష్మి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, సి డి వో లు జగదీశ్వరి, ఉమామహేశ్వరి, శ్రీకాంత్, ప్రజారోగ్యం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News