-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్, అంబర్, రెడ్ జోన్ల నిర్ధారణ ఇప్పటికే వీధి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ వారి సమన్వయంతో తయారుచేసినందున, ఏమన్నా లోపాలున్నా మార్పు చేతుకులు ఉన్న తుది నివేదికను కమిటీ సమక్షంలో చర్చించి తమకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారస్తుల సర్వే ఈ వారంలో పూర్తిచేయాలని వీధి వ్యాపారస్తులకు స్వానిధి లోన్ల గురించి కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వారికి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ లేని వీధి వ్యాపారస్తులు వీధిలో వ్యాపారం చేయకూడదని అన్నారు. వీధి వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యనైనా కమిటీ సభ్యులు తమ వద్దకు తీసుకురావచ్చు అని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే దిశగా టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు వివరిస్తారని తెలిపారు. విధి వ్యాపారస్తుల కమిటీ సభ్యులు వీధి వ్యాపారస్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా కమిటీలో చర్చించి కమిటీ తీసుకున్న నిర్ణయాలను విధి వ్యాపారస్తులకు తెలియజేయాలని కమిషనర్ అన్నారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) ఎం. విజయలక్ష్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్లు ప్రభుదాస్, కె. షమ్మీ, డిసిపి చంద్రబోస్, ఎసిపిలు రాంబాబు, మోహన్ బాబు, బ్రాంచ్ మేనేజర్ M. సుధాకర్, కమిటి సభ్యలు అయిన వీధి వ్యాపారస్తులు L.V. ముర్తిరావు చిప్పడ, వడ్లముడి శ్రీనివాస్, నాగ వెంకట బాలకృష్ణ, షేక్ సబీర్, బొమ్మిసేట్టి జగన్మోహన్ రావు, కంకిపాటి రత్నకుమారి, పిల్లి నాగమల్లేశ్వరి తదితర్లు , పాల్గొన్నారు.,
Prajavartha Online Telugu News