-చిన్నపిల్లలు టపాసులు, కాకర్లు వెలిగించేటప్పుడు వారి తల్లితండ్రులు తప్పనిసరిగా వారి వద్దనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి…
-ఎమ్మేల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేచశారు. కైకలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న దీపావళి బాణసంచా నూతన షాపులను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా షాప్ యాజ్యమానులు మండా వెంకటరత్నం, కంతేటి వెంకటరత్నం, ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దీపావళి సామాగ్రి నూతన షాపులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, వాతావరణం అనుకూలించి లాభసాటిగా మీ వ్యాపారం జరగాలని కోరుకుంటున్నానని, కానీ అదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యత గల సరుకును సరసమైన ధరలకు ఇవ్వాలని షాపుల యజమానులకు సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించి పండుగ జరుపుకోవాలని కోరారు. అదేవిదంగా చిన్న పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోని దీపావళి మందు సామాగ్రి కాల్చుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు టపాసులు కాల్చేటప్పుడు వారి తల్లితండ్రులు తప్పనిసరిగా వారి వద్దఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షాప్ యాజమానులు, కొత్త రమేష్, కమ్మిలి శివ, ఆకుల శ్రీనివాస్, లక్ష్మి కాంత్, శ్రీనివాస్, వానమరాజు, నాయకులు కూనవరపు సతీష్, పాణెం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News