రాష్ట్రప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలి…

-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండల ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యంపీపీ కార్యాలయంలో మంగళవారం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలిదిండి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన ఫిల్టర్ త్రాగునీరు అందించాలని, అదేవిదంగా వర్షాకాలం వలన గ్రామాలలో నీరు ఎక్కువ నిల్వలేకుండా, సర్పంచ్ లు ప్రత్యేక బాధ్యత తీసుకోని కచ్చ డ్రైన్ తవ్వించి, నీరు నిల్వలేకుండా చూడాలని అన్నారు. గ్రామ్లాల్లో వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు ప్రతి సంక్షేమ పధకాన్ని అర్హులకు నేరుగా అందిస్తున్నారన్నారు. నాయకులు, అధికారులు, సమిష్టి కృషితో ప్రజలకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదేవిదంగా కలిదిండి మండలంలోని 2 పంచాయతీలకు అమరావతి, కలిదిండి పంచాయతీలకు ఇటీవల గౌరవ సర్పంచ్ లు, గండికోట నరసింహమూర్తి, తట్టిగోళ్ల నాగమల్లేశ్వరమ్మలు కరోనాతో మృతి చెందారని, వారి స్థానాలలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, మండల నాయకులతో 2 పంచాయతీల ఎన్నికల పైన చర్చించడం జరిగిందని రేపు అభ్యర్థులను వివరిస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, వడుపు రామారావు, నీలపాల సుబ్బయ్య, బత్తిన ఉమామహేశ్వరరావు, సాన వెంకటరామారావు, నున్న కృష్ణబాబు, నీలి సుమన్,మహ్మద్ చాన్ బాషా, షేక్ హాఫిజ్,పెరుమాళ్ళ భోగేశ్వరరావు, సాగి వాసురాజు, మండ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *