అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలతోపాటు, పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జనసేన పక్షాన నిలిచి పోరాడిన ప్రతి అభ్యర్థికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఎన్నికలకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు శుభాకాంక్షలు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగింది. క్షేత్ర స్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …