సత్తెనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
నేను ఎంత ఎదిగిన నా సహచర మిత్రులతో ఒదిగి ఉంటానని హస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. హెచ్ఆర్ చంద్రం రచించిన బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆదివారం సత్తెనపల్లి కెనాల్స్ గెస్ట్ హౌస్ లో ఆయన మిత్రులు.. డాక్టర్ గడ్డం విజయసారధి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తన సహచరులకు ఫోన్లో కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. భారతదేశ చరిత్రలోనే ఒక నటుడి గురించి ఒక శతకం రచించటం సంతోషంగా ఉందన్నారు.నాపై అభిమానంతో సీనియర్ జర్నలిస్ట్ పూల్లారెడ్డి అర్ధిక అంశాలను అధగమించి పుస్తకాన్ని సమాజానికి అందించటం అభినందనీయం అన్నారు. రచయిత హెచ్ ఆర్ చంద్రం తరుపున మొదుగుల సుబ్బారావు పుస్తకాన్ని బ్రహ్మానందం మిత్రుడు పుల్లారెడ్డి అంకితం ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ హైకోర్టు న్యాయవాది ఉల్లం శేషగిరిరావు అద్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ జాతీయ చిత్రకారుడు జింకా రామారావు సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విజయవాడ ప్రెస్ క్లబ్ అద్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు. నంద సాంబశివరావు. గంగారపు వెంకట్రావు టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ యలినేడి రామస్వామి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సయ్యద్ కరిముల్లా, కంబాల వేంకటేశ్వరావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గార్లపాటి ప్రభాకర్, సత్తెనపల్లి న్యూస్ ఆర్గనైజర్ గుండ్లవల్లి అమర్ నాధ్ తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …