-ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సల విభాగాన్ని ప్రారంభించిన…
– వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు ఉచితంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు.
స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సా విభాగాన్ని బుధవారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్, వైధ్యాధికారులు, స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) కృషి వల్ల గుడివాడ ఏరియా ఆస్పత్రికి నేడు ఇద్దరు కంటి డాక్టర్లను నియమించారన్నారు. కంటి విభాగంలో నిపుణులైన కంటి వైద్యులు ఇక నుంచి నిరంతరం గుడివాడ పట్టణంతో పాటు పరిశర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి కంటి సమస్యలు వచ్చిన ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరం మేరకు ఆపరేషన్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడివాడ ఏరియా ఆస్పత్రి రోజురోజుకు అభివృద్ది చెందుతుందన్నారు. ఏరియా ఆస్పత్రిలో డయాలిసిస్ సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) సంబందిత ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులతో చర్చించారన్నారు. రాబోయేమాసంలో 5 బెడ్ల తో కూడిన డయాలిసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో అత్యాధునిక నేత్ర వైద్య,యంత్ర సామాగ్రిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కంటి వెలుగు వైద్య విభాగంలో అందుబాటులో ఉందని గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శశిభూషణ్ సూచించారు.
ఈ సందర్బంగా ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ ఇందిరా దేవి వివరిస్తూ కంటి వెలుగు విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో, ప్రజానీకానికి నేత్ర వైద్య చికిత్సల సేవలను అందిస్తామన్నారు.
కార్యక్రమలో వైసిపి పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను , ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వియం. నారాయణరెడ్డి, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు మాదాసు వెంకట లక్ష్మి, నేత్ర వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News