Breaking News

సచివాలయంలో గనులశాఖ ఆధ్వర్యంలో ‘ఖనిజాదాయం- కార్యాచరణ’పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్

-వర్క్‌షాప్‌ను ప్రారంభించిన PR&RD, గనులశాఖ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-సమావేశంకు హాజరైన PR&RD, గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డబ్ల్యుబి చంద్రశేఖర్, రాజబాబు, శ్రీనివాస్, పలువురు డిడిలు, ఏడిలు, ఇతర మైనింగ్ అధికారులు
– రాష్ట్రంలో మైనింగ్ రెవెన్యూ పెంపుదలపై సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను గుర్తించి, మైనింగ్ లీజులు జారీ చేయడం ద్వారా ఖనిజ ఆధారిత రెవెన్యూను పెంచుకోవాలని రాష్ట్ర పిఆర్‌ & ఆర్డీ, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఖనిజాదాయం-కార్యాచరణ పేరుతో గనులశాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా వర్క్‌షాప్‌లో పాల్గొన్న గనులశాఖ జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఎడిలు, ఇతర అధికారులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ ఏడాది గనులశాఖ ద్వారా 3584 కోట్ల రూపాయలు ఆదాయంగా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు దానిలో 81 శాతం సాధించామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ.2917 కోట్ల రూపాయలు ఖనిజ ఆధారిత ఆదాయాన్ని ఆర్జించామని అన్నారు. వచ్చే మార్చి 31 నాటికి మిగిలిన లక్ష్యాన్ని కూడా సాధించేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5165 కోట్ల రూపాయల ఖనిజ ఆధారిత రెవెన్యూగా సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. గనుల లీజు అనుమతుల విషయంలో ప్రభుత్వం పదిరెట్లు ప్రీమియం విధానంను అమలులోకి తీసుకువచ్చిందని, ఈ మేరకు లీజుకు దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించి ఈ ప్రీమియంను చెల్లించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇందుకు డిసెంబర్ 15ను తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల సుమారు 2925 మైనింగ్ లీజులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పర్యావరణ అనుమతులను సమర్పించని దరఖాస్తుల విషయంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు లీజులను రద్దు చేసి, త్వరలో ఆక్షన్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1538 మైనింగ్ లీజులకు ఎన్‌ఓసిలు పొందకుండా ఉన్న వాటిని సమీక్షించాలని, వాటిని కూడా ఆక్షన్ జాబితాలో పొందుపరచాలని అన్నారు. రాష్ట్రంలో ఖనిజాల అన్వేషణకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతున్న సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పటికే ఖనిజ అన్వేషణలో పలు ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నాయని, వాటి సాంకేతిక సామర్థ్యంను పరిగణలోకి తీసుకుని సదరు సంస్థల సేవలను కూడా తీసుకోవాలని సూచించారు. జిల్లాల పరిధిలో లభ్యమయ్యే ఖనిజాలకు సంబంధించి మైనింగ్ అంశాలపై డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు సమగ్ర పరిశీలన జరిపి, కొత్త మైనింగ్ బ్లాక్‌లను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మైనింగ్ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, అదే క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. గనుల శాఖ ద్వారా అటు ఖనిజాల వెలికితీత, మరోవైపు పారిశ్రామిక ప్రగతికి సీఎం శ్రీ వైయస్ జగన్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారుల పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ విజి వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డబ్ల్యుబి చంద్రశేఖర్, రాజబాబు, శ్రీనివాస్, పలువురు డిడిలు, ఏడిలు, ఇతర మైనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *