విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం లోని పౌరులకు గౌరవ మర్యాదలు ఎలా ఉండాలనేది రాజ్యాంగం లో జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటాలిటీనాలుగు అంశాలను పొందుపరిచారని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజ శేఖర్ విద్యార్థులను ఉద్దేశించి సూచించారు.
స్థానిక కోనేరు బసవయ్య చౌదరి ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాగం లోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే……
*న్యాయం – జస్టిస్ : జ్యూడిషీయల్ పరంగా ప్రజలకు సామజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలలో న్యాయ బద్దంగా తోడ్పాటు ఎంతో ముఖ్యమని సూచించడం జరిగిందన్నారు.
* స్వేచ్ఛ – లిబర్టీ : ఈ విషయంలో భావము, భావ ప్రకటన, ధర్మము, ఆరాధనతో కూడిన విశ్వాసం కలిగి ఉండేందుకు ప్రయిత్నిచాలని వివరించడం జరిగిందన్నారు.
* సమానవత్వం – ఈక్వాలిటీ : అంతస్తులలోను, అవకాశాలలోను ప్రతి ఒక్కరిలో వ్యక్తి గౌరవం జాతి ఐక్యత పెంపొందించుకునే దిశగా ఎదగాలనే అంశం రూపొందించడం జరిగిందన్నారు.
* సౌబ్రాతృత్వం – ఫెటాలిటీ : రాజ్యాగంలో పొందుపరిచిన నాలుగు అంశాలలో అతి ముఖ్యమైన అంశంగా ఫెటాలిటీ కలిగి ఉంటుంది. దేశ సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య మనుగడను, అఖండతను చేకూర్చు దిశగా అడుగులు పడేందుకు రాజ్యాగం శ్రీకారం చుట్టడం జరిగిందని రాజశేఖర్ వివరించారు.
వివరించిన అంశాలు అన్నిటిని నృత్య, గేయ, నాటికల ద్వారా విద్యార్థులతోఎంతో చూడ చక్కగా అభినయం చేసిన వారికి రాజశేఖర్ అభినందనలు తెలుపుతూ ఈ స్కిట్ లను రూపొందించిన ఉపాధ్యాయులకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి దశ నుండే రాజ్యాంగం లోని ఈ నాలుగు అంశాల వరకుఅవగాహనకలిగి ఉండేందుకు కృషి చేయాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్ సూచించారు.ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇచ్చిన సందేశాన్ని లైవ్ స్క్రీన్ పై ప్రదర్శించగా విద్యార్థులు తిలకించారు.
కార్యక్రమంలోకృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రి సెల్వి, ఆర్ జె డి మధుసూధన రావు, సంచాలకులు దేవానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …