-దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ నందలి వార్డ్ సచివాలయాల సందర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వివిధ సంక్షేమ పథకములకు సంబంధించి లబ్దిదారుల జాబితా, సంక్షేమ క్యాలెండర్ మొదలగునవి నోటీసు బోర్డు నందు ఉంచాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ శనివారం 30వ డివిజన్ పరిధిలోని దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ ప్రాంతాలలో గల 247, 249, 250 మరియు 251 వార్డ్ సచివాలయములను సందర్శించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలిస్తూ, సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి తప్పని సరిగా బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయవలెనని ఆదేశించారు. సచివాలయంలో రిజిస్టర్ ల నిర్వహణ సక్రమముగా ఉండాలని ఆదేశించారు. సచివాలయాలలో ప్రజల నుండి సమస్యలపై అందిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకొని ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.