క్యాపిటల్ హాస్పిటల్స్ లో విజయవంతంగా తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స…

-మూత్రపిండాలు దెబ్బతినడంతో అస్వస్థతకు గురైన యువకుడు
-కిడ్నీ దానమందించి తన కుమారుడికి మరో జన్మనిచ్చిన తండ్రి
-దాత, గ్రహీతలిరువురూ క్షేమంగా డిశ్ఛార్జి
-క్యాపిటల్ హాస్పిటల్స్ లో అందుబాటులో అత్యాధునిక చికిత్సలు
-క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె హరీష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల మన్ననలందుకుంటున్న క్యాపిటల్ హాస్పిటల్స్ విజయప్రస్థానంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. క్యాపిటల్ హాస్పిటల్స్ నందు తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనారోగ్యానికి గురైన యువకుడికి అతడి తండ్రి తన కిడ్నీని దానం చేసి మరో జన్మనివ్వడం విశేషం. క్యాపిటల్ హాస్పిటల్స్ చరిత్రలో మైలురాయిగా చెప్పదగిన ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్ నందు జరిగిన ఈ సమావేశంలో “తెనాలి ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ క్యాపిటల్ హాస్పిటల్ కు రావడంతో పరీక్ష నిర్వహించారు. పుట్టుకతోనే ఒకే కిడ్నీ ఉన్న అతనికి అదికూడా పూర్తిగా చెడిపోయిన స్థితిలో తెనాలిలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ ను సంప్రదించారు. పేషేంటుకు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అత్యధిక స్థాయిలో క్రియాటినిన్ నమోదు కావడంతో పాటు, మూత్రపిండాలు పాడయినట్లు గుర్తించడం జరిగింది. పేషేంట్ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా కిడ్నీ మార్పిడి అవసరమని నిర్ధారించుకుని, నవంబరు 22న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించాం” అని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.తమ హాస్పిటల్ నందు అడ్వాన్స్డ్ CRRT డయాలసిస్, లేజర్, ల్యాపరోస్కోపి, ఎండోస్కోపి విధానాల ద్వారా కిడ్నీ వ్యాధులకు అత్యుత్తమ చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ కుమార్ పెరుగు, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్లు డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ త్రివేది దొండపాటి, జనరల్ సర్జన్ డాక్టర్ వి. సురేష్ కుమార్, చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీధర్, అనస్థీషియాలజిస్టులు డాక్టర్ సీహెచ్. మురళీ కృష్ణ, డాక్టర్ సీహెచ్. అర్చనలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. శస్త్రచికిత్స అనంతరం తండ్రీకుమారులైన దాత, గ్రహీతలిరువురూ నవంబరు 30న సురక్షితంగా డిశ్చార్జయ్యారని డాక్టర్ హరీష్ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి వంటి అత్యాధునిక చికిత్సలను అందిస్తున్న క్యాపిటల్ వైద్యులకు యువకుని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో క్యాపిటల్ హాస్పిటల్స్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ వి. సురేష్ కుమార్, హాస్పిటల్ సీవోవో శివరామకృష్ణ, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ త్రివేది దొండపాటి, డాక్టర్ ఎం. శ్రీధర్, వివిధ విభాగాలకు చెందిన సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *