-అధికారులకు సమన్వయంతో కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి…
-జిల్లా కలెక్టరు జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు అభివృద్దిలో భాగంగా రూ.16,920 కోట్లతో రాష్ట్రంలోని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు విచ్చేస్తున్న -కేంద్రమంత్రులు నితిన్ గడ్కరి, జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబందించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 10 వ తేదీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసేందుకు విచ్చేస్తున్న కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టరు జె.నివాస్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 10 వతేదీ ఉదయ 10 గంటలకు కేంద్ర రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, కేగంద్ర టూరిజం శాఖ మంతి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రూ. 16,920 కోట్ల రూపాలయతో పూర్తి చేసిన, శంకుస్థాపన చేసే 41 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అందుకు సంబందించి స్టేడియంలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తన నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు విచ్చేస్తారని ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. అధికారులు తమకు అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా చేయాలన్నారు. వేదక వద్ద మూడు గ్రీన్ రూమ్ లు ఏర్పాటు, నమూనా బ్రిడ్జి, విఐపీ, వివిఐపీలు కూర్చునే గ్యాలరీల ఏర్పాట్లను, గ్రీన్ టీఫాయ్ బస్ ను కలెక్టరు పరిశీలించారు. అదేవిధంగా ఆహుతులను ఆకట్టుకునేందుకు క్లాసికల్ నృత్యాలు, జాతీయ గీతాలుతో కూడిన పలు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారన్నారు. కార్యక్రమంలో విజయవాడ మునిసిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టరు(ఆసరా) కె.మోహన్ కుమార్, నేషనల్ హైవేస్ పిడి డి. నారాయణ, డి. శ్రీనివాస్, పీడీ డ్వామా సూర్యనారాయణ, పీడీ సర్వశిక్షాభియాన్ శేఖర్,ముడా వీసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News