Breaking News

యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటిల్మెంట్‌ ప్రోగ్రాంపై సమీక్ష

-నగరాన్ని సుస్థిరoగా అభివృద్ధి పరచే దిశగా చర్యలు – కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాన్ని సుస్థిరoగా అభివృద్ధి పరచాలనే లక్ష్యంగా తగిన చర్యలు చేపట్టి అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌  ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర సుస్థిర అభివృద్ధి పై యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటిల్మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా యున్ – హబిటాట్ నగరపాలక సంస్థ అధికారులు, యున్ – హబిటాట్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్‌ శ్రీ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని రానున్న కాలంలో మెరుగైన మౌలిక వసతులు, క్లీన్‌, గ్రీన్‌ నగరంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్‌-హెచ్‌.ఏ.బి.ఐ.టి.ఏ.టి. ప్రతినిధులు గత ఏడాది కాలం నుండి నగరంలో పర్యావరణ పరిరక్షణ, ప్రధాన రహదారుల అభివృద్ది, ప్రజా రవాణా మెరుగుదల, ఫ్రాగ్మెంటెడ్ బ్లూ గ్రీన్ నెట్‌వర్క్, చిన్న చిన్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాలు మరియు సేవలకు సంబందించి పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా మౌలిక వసతులపై సమగ్ర అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం యున్ – హబిటాట్ ప్రతినిధులు సర్వే వివరాలను పవర్‌ పాయింట్‌ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో యున్ – హబిటాట్ సీనియర్‌ అర్బన్‌ ప్లానర్స్ మాన్సీ, ఆస్థా, సాలిడ్‌ వేస్ట్ మేనేజ్మెంట్‌ ఎక్స్పర్ట్ స్వాతి సింగ్‌, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదదేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్‌ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *