-రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలలో ప్రధమ స్థానం లో నిలిచిన ఎం కార్తీక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర గుంటూరువారి అద్వర్యం లో “దేశభక్తి మరియు జాతి నిర్మాణం” అంశం ఫై రాష్ట్రము లో అన్ని జిల్లా ల నుంచి జిల్లా స్థాయి విజేతలకు రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ ఉపన్యాస పోటీలు రిపబ్లిక్ డే 2022 ఉత్సావాలలో భాగంగా “కలిసి మేము పెరుగుతాము, కలిసి మేము వృద్ధి చెందుతాము, కలిసి మేము బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మిస్తాము” థీమ్ ఫై నిర్వహించారు. రాష్ట్ర స్థాయి ప్రధమ స్థానానికి చిత్తూర్ జిల్లా నుంచి ఎం కార్తీక్, ద్వితీయ స్థానానికి అనంతపురం నుంచి కె మని చందన మరియు త్రుతీయ స్థానానికి గుంటూరు జిల్లా నుంచి సయ్యిద్ సాజిదా విజేతలు గ గెలుపొందారని న్యాయ నిర్ణేతలు గ వ్యవహరించిన డా.సి హెచ్ ప్రవీణ్, పి వై బి ఎల్ ప్రసూనా, బూర్గుల షర్మిల లు తెలిపారు. ముఖ్య అతిధి బి జె ప్రసన్న మాట్లాడుతూ వివిధ భాషలు, కళలు , సంస్కృతి సంప్రదాయాలతో సుభిక్షమైన భారత దేశం లో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేలా వ్యవహరించాలని తద్వారా దేశ భక్తి పెంపొందేలా నడుచుకోవాలని ఈ ఉపన్యాస పోటీలు జాతీయ స్థాయిలో ప్రతి స సంవత్సరం రిపబ్లిక్ డే ఉత్సవాలలో భాగముగా జరుగుతాయని, రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం నిలిచిన విజేత జాతీయ స్థాయిలో జనవరి రెండవ వారంలో న్యూఢిల్లీ లో జరగనున్న పోటీలలో పాల్గొంటారని తెలియజేసారు. ఆ తరువాత విజేతలకు ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన వారికీ వరుసగా 25000 , 10000 , 5000 నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రంతో పాటు, పోటీదారులందరికి ప్రశంస పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమములో గుంటూరు నెహ్రు యువ కేంద్ర జిల్లా యువ అధికారిణి కిరణ్మయి దేవిరెడ్డి గారు వందన సమర్పణ చేయగా, పోటీదారులతో పాటు ప్రోగ్రాము అసిస్టెంట్ బి వినయ్ కుమార్, బుర్రా సీతారాం, సి ఎచ్ సుమంత్ మరియు నెహ్రు యువ కేంద్ర జాతీయ యువ సేవ కర్తలు పాల్గొన్నారు