అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వి.ఐ.టి – ఎ.పివిశ్వవిద్యాలయంలో గురువారం వి.ఐ.టి – ఎ.పిస్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) అధ్వర్యంలో 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ సినారియో (ICBTEGS) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈసదస్సు16న ప్రారంభమై , 18 డిసెంబర్ 2021వరకువర్చ్యువల్ విధానంలో కొనసాగుతుంది.ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సీనియర్ డైరెక్టర్ ఎకనామిక్ యూత్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్, కామన్వెల్త్ సెక్రటేరియట్, యునైటెడ్ కింగ్‌డమ్ డా|| రూత్ కట్టమూరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ 4వ పారిశ్రామిక విప్లవంలోని అవకాశాలను వివరించారు. దేశాభివృద్ధికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత సంసిద్ధత అవసరమని తెలియజేస్తూ, మల్టీ డిసిప్లినరీ స్టడీస్‌తో యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాయకులను అందించేందుకు వి.ఐ.టి విశ్వవిద్యాలయంఎప్పుడూ ముందుంటుందనిఆమె కొనియాడారు.
గౌరవ అతిదిగా హాజరైన సిఇఓ&యండి, యంఎఫ్యుటిలిటీస్ గణేష్ రామ్ మాట్లాడుతూ గ్లోబల్ సినారియోలో ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ పరివర్తన, యునికార్న్ స్టార్టప్‌లు, క్యాపిటల్ మార్కెట్ గ్రోత్ & డీమ్యాట్ ఖాతాలు మరియుస్టాక్ మార్కెట్, ఫిన్‌టెక్ వృద్ధి గురించి వివరించారు.
అసోసియేట్ డీన్, VSB డా|| రాఘవేంద్ర మాట్లాడుతూ , ఈ సదస్సులో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఎకనామిక్స్ మరియు సంబంధిత అంశాలలో8 దేశాల నుండి 77 పేపర్లు సమర్పించారని, నార్వే, థాయ్‌లాండ్, సింగపూర్, ఫ్రాన్స్, ఇరాన్ మరియుజింబాబ్వే దేశాలనుండి ఈ సదస్సుకు హాజరయ్యారని తెలియచేసారు. ఈ సదస్సులో వక్తలుగా డా|| జె.ఎం.అరుల్ కామరాజ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంటు అఫ్ సోషల్ వర్క్ లయోలా కాలేజ్, చెన్నై)డా||ఎస్.శ్రీనివాసన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, వినోద్ గుప్త స్కూల్ అఫ్ మేనేజ్‌మెంట్,ఐఐటి ఖరగపూర్ )డా||ఎస్లలిత (అసిస్టెంట్ ప్రొఫెసర్,రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్, చెన్నై)స్వయంకుమార్ తిబ్రేవాల్(ఐఐఎంబెంగళూరు పూర్వ విద్యార్థి, అసోసియేట్ కన్సల్టెంట్, ఆక్టస్ సలహాదారులు) పాల్గొనిప్రసంగిస్తారని తెలియచేసారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సింగపూరియన్శివకుమారి (ఉమా) జగదీశన్, గ్లోబల్ సిఓఓమరియు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ఐ క్యూబ్కన్సార్టియంసింగపూర్. హాజరవుతారని తెలియచేసారు.
వి.ఐ.టి. – ఏ.పివిశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డిమాట్లాడుతూవిఐటి ఇంజినీరింగ్‌కు పేరుగాంచిందని, నాన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మరియు హ్యుమానిటీస్ ప్రారంభించామని తెలిపారు.. వి.ఐ.టి – ఎ.పిస్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా బిబిఏ జనరల్ మేనేజ్‌మెంట్, బిబిఏ డిజిటల్ మార్కెటింగ్ (డిజిటల్ స్కాలర్ వారి పారిశ్రామిక సహకారంతో) బిబిఏ 2+2 ప్రోగ్రాం లో భాగంగా మిచిగాన్ విశ్వవిద్యాలయం, డియర్‌బోర్న్, అమెరికా మరియుఅరిజోనా స్టేట్ యూనివర్శిటీ, అమెరికా లతో ఒప్పందం కుదుర్చుకున్నామని అదే విధంగా బి.కాం ఫైనాన్సు (సి.ఏ ఫౌండేషన్, మాస్టర్ మైండ్స్ వారి సహకారంతో) అందిస్తున్నామని తెలియచేసారు. అంతే కాకుండావిశ్వవిద్యాలయ ప్రగతి గురించి, వివిధ విభాగాలు, పరిశోధన, ఉపాధి అవకాశాల గురించి వివరించారు మరియువిశ్వవిద్యాలయం పరిశోధన మరియు అభివృద్ధి యొక్క గ్లోబల్ హబ్‌గా మారాలనే లక్ష్యంతో కొనసాగడానికి కట్టుబడి ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలోవిఐటి-ఎపివిశ్వవిద్యాలయరిజిస్ట్రార్డా||సిఎల్‌విశివకుమార్, ఐసీబీటీఈజీ కన్వీనర్ డా|| ఏవీవీఎస్ సుబ్బలక్ష్మి, ఐసీబీటీఈజీ కో-కన్వీనర్ డా||శాలినిరోసలిన్, డైరెక్టర్లు, డీన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.