Breaking News

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు క్రైస్తవ సోదర, సోదరీమణుల కు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో ఉంటాయన్నారు. సేవాతత్పరతను యావత్ మానవాళికి బోధించిన క్రీస్తు జన్మదినం విశ్వవ్యాప్తంగా ఎంతో సంతోషకరమైన రోజు అని, ప్రజలు ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపు కోవాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం శాంతియుత సహజీవనం ఇదీ జీసస్ మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశం అని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి ఒమీక్రాన్ రూపంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *