నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓ టి ఎస్) పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె.రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం, ఇళ్లస్థలాల దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై సోమవారం డివిజన్లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద నూజివీడు డివిజన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి సంబంధించి 13 వేల 665 రిజిస్ట్రేషన్ పత్రాలు ముద్రించడం జరిగిందని, వీటిలో 12 వేల 456 రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయా మండలాలకు పంపించడం జరిగిందన్నారు. వీటిలో ఇంతవరకు 6 వేల 74 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత మండలాల అధికారులు పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు మంగళవారం లోగా పంపిణీ చేయాలని ఆర్డీఓ తహసిల్దార్ లను ఆదేశించారు. 90 రోజులలోగా ఇళ్లస్థలాల మంజూరు కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హులైన వారి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయలన్నారు. 90 రోజులలోగా ఇళ్లస్థలాల మంజూరు కార్యక్రమంలో 7 వేల 409 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో అర్హత కలిగిన 3 వేల 335 మంది పేర్లను ఆమోదించడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News