-హాస్టల్ లో కలుషిత ఆహారంతో అసుపత్రి పాలైన విద్యార్ధినుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. హాస్టల్ లో నిన్న ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా 36 మంది హాస్టల్ విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థినులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని విద్యార్ధినులకు సూచించారు. హాస్టల్ లో పరిస్థితులపై విద్యార్థులు చంద్రబాబుకు వివరించారు. ముందుగా 29 మంది విద్యార్థులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని….తరువాత మరో 7 గురు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరారని చంద్రబాబుకు తెలిపారు. జరిగిన ఘటనకు భయపడి విద్యార్థులు మెస్ లో ఆహారం కూడా తీసుకోవడం లేదని విద్యార్థినులు చంద్రబాబుకు వివరించారు. అందరూ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వందల మంది విద్యార్థులు ఉండే హాస్టల్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.