అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకొని వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలతో తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డులను గెలుచుకుంది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 165 అవార్డులను దక్కించుకొని ఏపీ పోలీస్ శాఖ ప్రధమ స్థానంలో నిలిచింది. టెక్నాలజి సభ అవార్డులను దక్కించుకున్న జిల్లా పోలీస్ యూనిట్ లు. పోలీస్ ప్రధాన కార్యాలయం (8),అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1).
డిజిటల్ టెక్నాలజీ సభ- 2022 అవార్డుల వివరాలు:
Body Worn Cameras live Streaming:
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు, కంట్రోల్ రూమ్ కి లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ప్రజల పట్ల సిబ్బందిలో జవాబుదారీతనం పెరగడంతోపాటు కంట్రోల్ రూమ్ నుండి ఉన్నతాధికారులు నేరుగా సూచనలను అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
APOLIS:
పోలీస్ శాఖలోని ప్రతి విభాగాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా పేపర్ రహిత కార్యాలయంగా పోలీస్ శాఖను మార్చడానికి APOLISను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తద్వారా కార్యాలయంలో పనులు వేగవంతం చేయడంతో పాటు నిధుల వినియోగాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
GIS ఆధారిత GPS System:
అత్యవసర సమయాల్లో వినియోగించే 5000 పోలీసు వాహనాలకు GIS ఆధారిత జి పిఎస్ విధానం అమర్చడం ద్వారా ఫిర్యాదుల పట్ల పోలీసులు ప్రతిస్పందించే సమయాన్ని కుదించడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Disha Centralized Command Control Room:
రాష్ట్రంలోని మహిళల భద్రతకు కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చిన దిశ అప్లికేషన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నా కోటికి పైగా వినియోగిస్తున్న వారికి సత్వర సేవలను 24 గంటల పాటు పర్యవేక్షించడానికి ఈ యాప్ ద్వారా SOS కాల్ అందగానే, కంట్రోల్ రూమ్ నుండి బాధితురాలికి సమీపంలో అందుబాటులో ఉన్న స్థానిక పెట్రోలింగ్ వాహనాన్ని, సంబంధిత పోలీస్ స్టేషన్ కు తక్షణమే అప్రమత్తం చేయడం తో పాటు ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడంలో దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది.
ROIP (రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ):
ప్రస్తుతం పోలీస్ శాఖ వినియోగిస్తున్న VHF కమ్యూనికేషన్ పరికరాలను రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయటం ద్వారా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లు మరియు అంతర్ జిల్లాల చెక్ పోస్ట్ లను తక్షణం అప్రమత్తం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
HAWK VEHICLE:
అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి అప్పటికప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు వీడియో స్ట్రీమింగ్ ద్వారా క్షేత్రస్థాయి సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూం కు చేరవేయడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Video Conference System :
రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామ సచివాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయటం వలన గ్రామ స్థాయి వరకు ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసులకు తెలియజేయటానికి అత్యంత సులభమైన మార్గంగా ఈ విధానం ను వినియోగించడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు సత్వరమే మరింత మెరుగైన సేవలను అందించడంలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది.
Digital Health Profile:
పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్యం భద్రతపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హోంగార్డు మొదలుకొని డిజిపి స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితితో పాటు వారి యొక్క హెల్త్ ప్ర ఫైల్ ను డిజిటలైజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఈ విధానం ద్వారా వారిని అప్రమత్తం చేయడం మరియు ప్రత్యేక శ్రద్ధ వహించడం లో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిపి అభినందన
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుందని ఇప్పటికే జాతీయ స్థాయిలో అత్యంత స్వల్ప కాలంలో 165 జాతీయ అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకుంది. ఏ టెక్నాలజీ వాడినా ఆ ఫలాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించి వారికి సత్వర న్యాయం చేకూర్చినప్పుడే అది అర్థవంతం అవుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు చేసిన మరియు చేస్తున్న కృషి నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఈ విజయం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం, వెన్నుతట్టి ప్రోత్సహించడం ఎంతగానో తోడ్పాటుని అందించింది.
ముఖ్యమంత్రి అభినందన
రాష్ట్రం లోని ప్రజలకు సామాజిక న్యాయం, ముఖ్యంగా మహిళలు ,చిన్నారులు, సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చెందిన వారికి చేరుకునే విధంగా, వారికి మెరుగైన భద్రత కల్పిస్తున్నాము అనే భరోసా కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ చేస్తున్న కృషిని నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని పేర్కొన్న ముఖ్యమంత్రి వై.యెస్. జగన్ మోహన్ రెడ్డి.