-త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శివనామ స్మరణం సర్వపాపహరణమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సీతారామపురంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం నమశ్శివాయ: అని హృదయపూర్వకంగా ఆ శివయ్యను ధ్యానిస్తే.. మనసు ఎంతో నిర్మలమవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. భక్తుల పాలిట పెన్నిధి అయిన శివుని పూజిస్తే కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయన్నారు. శివశబ్దం ముక్తికారకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రశాంతచిత్తంతో శివుని ప్రార్థిస్తే కర్మానుసారం వచ్చే కష్టాలు, రోగాలు, దు:ఖాలు తొలగిపోతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా శివ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, బ్రహ్మకుమారీలు భారతి, రత్న, మణి, బ్రహ్మకుమార్ చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు.