విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ ఆంజనేయ భవాని శంకర సూర్యనారాయణస్వామి వార్ల దేవాలయం, పోరంకిలో మార్చి 1 మంగళవారం మహాశివరాత్రి మహోత్సవాలు జరిగాయి. ప్రాత:కాల అభిషేకాలు, మధ్యాహ్నకాల అభిషేకం, ప్రదోషకాలములో అభిషేకం, దీపాలతో జ్యోతిర్లింగార్చన, భవాని శంకరుల దివ్య కళ్యాణ మహోత్సవము, లింగోద్భకాలములో అభిషేకాలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని దేవాలయ అభివృద్ధి కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటకూర కాశీ విశ్వేశ్వరరావు చైర్మన్, కమిటీ సభ్యులు వెలగ రంగారావు, పామర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …