Breaking News

ఈ నెల 13న ఎగ్జిబిషన్ లో ఫ్యాషన్ షో..

-ఇంత వరకూ ఎగ్జిబిషన్ ను 2 లక్షల 15 వేల మంది సందర్శించి రూ. 1 కోటీ 9 లక్షల రూపాయల వస్తాలు కొనుగోలు..
-మార్చి 18 వరకూ చేనేత వస్త్ర ప్రియులకు అందుబాటులో ఎగ్జిబిషన్ నిర్వహణ..
-జాయింట్ డైరెక్టర్లు కన్నబాబు, నాగేశ్వరరావులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో మార్చి 4 నుండి నిర్వహిస్తున్న జాతీయ చేనేత వస్త్ర కళా ప్రదర్శన చేనేత వస్త్ర ప్రియులను ఆకట్టుకుంది. గత వారం రోజులుగా వేలాదిమంది ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత వస్త్ర కళాకారులకు తమ సహకారాన్ని అందిస్తున్నారు. మార్చి 4 నుండి 10 వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ ను 2 లక్షల 15 వేల మంది సందర్శించారు. 1 కోటీ 9 లక్షల 36 వేల 182 రూపాయల విలువైన చేనేత వస్త్రాలను వస్త్ర ప్రియులు కొనుగోలు చేసారు. ఇంత పెద్ద ఎత్తున చేనేత వస్త్రాలపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ పట్ల చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత వస్త్రాలు భారతదేశ వారసత్వ సంపదలో ఒక భాగమని దేశం యొక్క గొప్పతనాన్ని వైవిధ్యాన్ని చాటి చెబుతూ చేనేత కార్మికులు అనేక కళాత్మక ఉత్పత్తులను సాధించి పెట్టారని, చీరను నేసి అగ్గి పెట్టెలో పెట్టి అందించిన ఘనత మన చేనేత కార్మికులకు దక్కినది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్షా 50 వేలమంది చేనేత కుటుంబాలు చేనేతను జీవన ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారని, మరో 90 లక్షల మంది ప్రత్యక్షముగా పరోక్షముగా చేనేత నేత అద్దకం, వైండింగ్, వార్పింగ్, సైజింగ్, డ్రెస్సింగ్, పీసింగ్ వర్క్స్ మొదలైన వాటిలో ఉపాధి పొందుతూ ఉన్నారు.
వస్త్ర ప్రియులను ఆకర్షించి కట్టిపడేసే విధంగా అనేక రాష్ట్రాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్ర డిజైన్ లను 113 ఎక్సిబిషన్ స్టాల్స్ లలో ప్రదర్శిస్తూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో 90 చేనేత సహకార సంఘాల సభ్యులు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణా, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, బీహార్, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ డిజైన్ వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో నిర్వహిస్తున్న అందమైన చేనేత వస్త్రాలను ప్రతిఒక్కరూ కొనుగోలు చేసి చేనేత కళా కారులను ప్రోత్సహించవల్సిన అవసరం ఎంత అయినా ఉన్నది. మార్చి 4న ప్రారంభించబడిన ఈ జాతీయ చేనేత వస్త్ర కళా ప్రదర్శన మార్చి 18 వరకూ నిర్వహించ నున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ఈ ఎగ్జిబిషన్ లో వస్త్రాలు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ లు ఎమ్. నాగేశ్వర రావు, కే. కన్నబాబులు కోరారు.

ఈనెల 13 న జాతీయ చేనేత వస్త్ర కళా ప్రదర్శనలో చేనేత వస్త్ర కళా రీతులతో ఫ్యాషన్ షో నిర్వహణ…
చేనేత వస్త్రాలను ధరిస్తే సంస్కృతీ సంప్రదాయాలు మన వెంటే ఉంటాయనే భావన ప్రతిఒక్కరిలో రేకిత్తించే విధంగా ఈ నెల 13న ఆదివారం సాయంత్రం సమయంలో 6 గంటలకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో గల చేనేత ఎగ్జిబిషన్ లో అందమైన చేనేత వస్త్రాలను ధరించిన యువతులు ఫ్యాషన్ షో నిర్వహిస్తారని చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ లు ఎమ్. నాగేశ్వర రావు, కే. కన్నబాబులు ఒక ప్రకటనలో తెలియజేసారు. చేనేత వస్త్రాలను ధరించడం వలన ఉండే ఆనందం, సంతృప్తి, సౌకర్యం వెలకట్టలేనిదన్నారు. మహిళలకు నచ్చే మెచ్చే చేనేత వస్త్ర ప్రపంచం ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నదని ప్రతీ ఒక్కరూ ఎగ్జిబిషన్ ను సందర్శించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కన్నబాబు, నాగేశ్వర రావులు తెలియజేసారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *