విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ యూనిట్ టి. కనకరాజు ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని పలు నిత్యావసర దుకాణాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని జగ్గయ్యపేట నందిగామ గుడివాడ హనుమాన్ జంక్షన్ ఉయ్యూరు విజయవాడ సిటీ లోని పలు నిత్యావసర దుకాణాల్లో దాడులు నిర్వహించారు. నిత్యవసర వస్తువులు ముఖ్యంగా వంట నూనెలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించినా అధిక ధరలు వసూలు చేసినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే సంబంధిత దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఆకస్మిక తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖ వివిధ స్థాయి అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …