విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో ఉన్న ప్రజలను వైఎస్ఆర్సిపి మోసం చేస్తుందని జనసేన నాయకులు, నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో శనివారం విక్రమ్ నాగు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. జనసేన నాయకులు తో కలసి మార్చి 14వ తేదీన అమరావతి లో జరిగే జనసేన 9 వ ఆవిర్భావ సభ ఛలో అమరావతి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ మార్పు కోసం పుట్టిన జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం తర్వాత దిశ, దశ మారనున్నాయని చెప్పారు. మూడు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. కొత్తతరం మార్పు కోసం పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వై ఎస్ ఆర్ ప్రభుత్వానికి ప్రజావ్యతిరేకత అంటే ఏంటో తెలిసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. జనసేన నాయకులు విక్రమ నాగు మాట్లాడుతూ జనసేన పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ సభ ఛలో అమరావతి కి సంబంధించిన పదివేల గోడ పత్రికను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సభను విజయవంతం చేయడానికి జనసైనికులు, వీరనారీమణులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …