-వైసిపి ప్రభుత్వం పతనం తధ్యం.
– జనసేనాని సభ విజయంతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు.
– ఆర్యవైశ్యుల ద్రోహి మంత్రి వెలంపల్లి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ సుమారు అరులక్షలకు పైగా జనసైనికులు హాజరైన ఇప్పడం జనసేన పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ సభ విజయవంతంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలయ్యిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ తనదైన శైలిలో వైసిపి నేతలపై విరుచుకుపడ్డారు. ఆద్యంతం నిద్రాహారాలు మాని పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసిన వైసిపి మాంత్రులకు,ఎమ్మెల్యేలకు, ప్రధానంగా మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ పశ్చిమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి వాళ్ళు గెలిచింది జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి కాదని, షర్మిళ పాదయాత్ర, విజయమ్మ , బ్రదర్ అనిల్ కృషి చేస్తే గెలిచారని స్పష్టం చేశారు.
వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళకి దండం పెడతున్న వైసిపి నేతలకు, పాలన వదిలేసి ఇంట్లో పడుకున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేక నమస్కారాలు అంటూ తనదైన స్టైల్లో చమత్కరించారు. వైసిపి నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలే గాని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన హామీల్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన మీరు ఇళ్లల్లో పడుకొని నిద్రపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పనికిమాలిన మంత్రి వెల్లంపల్లి పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని ఒక అవకాశం అంటూ బ్రతిమిలాడిన సందర్భాన్ని మర్చిపోకూడదన్నారు. రాష్ట్రంలో 150 దేవాలయాల పై దాడులు జరిగితే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రధాలను తగలబెట్టిన ఇంతవరకు ఏ ఒక్కరిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. వైసిపి పార్టీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం తప్ప ఏమీ చేయట్లేదన్నారు.వైసిపి ప్రభుత్వం పతనానికి నిన్నటి పవన్ కళ్యాణ్ సభ తో నాంది పలికిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మహిళల పై దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప పరిపాలన చేత కావడం లేదని విమర్శించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక అసమర్థ మంత్రి అని,తమ అధినేత పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన మాటలు విన్న ప్రజలు చీదరించు కుంటున్నారన్నారు. వైసిపి నేతలు ఓటమి భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి, మంచి సంక్షేమంతో పరిపాలన సాగిస్తారని తెలిపారు. ఆర్యవైశ్య ద్రోహిగా వెల్లంపల్లి శ్రీనివాస్ చరిత్రలో నిలుస్తారన్నారు. వ్యాపారం పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్నాడని, అసెంబ్లీలోదివంగత నేత రోశయ్య సంతాప సభ పెట్టించలేని అసమర్థుడుగా ఆయన్ని అభివర్ణించారు. అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిరంజీవి తన తండ్రి తరువాత తండ్రి లాంటివాడు అని చెప్పాడని గుర్తు చేశారు. కానీ మంత్రి నాని మాత్రం చిరంజీవిని గౌరవించడం లేదని అంటున్నారని ఇష్టాను సారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నానన్నారు. తండ్రి పేరు చెప్పుకుని కోట్లు దోచుకున్న చరిత్ర మీ నాయకుడిదని గుర్తు చేశారు. అటువంటి తండ్రి వైయస్ పేరును ఒక్క కొత్త పధకానికైనా ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. నమ్మి ఓట్లేస్తే… ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అవినీతి నాయకుడు మీకు గొప్ప అయితే మీరూ అవినీతిపరులే కదా అన్నారు. నీతి, నిజాయితీ తో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ మాకు ఆదర్శమన్నారు.ఈ విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు కొర గంజి వెంకటరమణ, రెడ్డిపల్లి గంగాధర్, పొట్నురి శ్రీను, నల్లబెల్లికనకారావు, శిగం శెట్టి రాము మరియు జనసేన నాయకులు రాజేష్ పాల్గొన్నారు