విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే…

ఆరవల్లి-భీమవరం టౌన్‌-నరసాపూర్‌ మధ్య
విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
దీనితో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య 186 కిమీల మేర విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ అనుసంధానం అందుబాటులోకి వచ్చింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య 45 కిమీల మేర డబుల్‌ లైన్‌ మరియు ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్లలో విద్యుదీకరణతో సహా డబ్లింగ్‌ పనులు ప్రారంభించడంతో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య 186 కిమీల దూరం నిరంతరంగా విద్యుదీకరణతో సహా డబుల్‌ లైన్‌ రైల్వే అనుసంధానం ఏర్పాటు అయ్యింది. దీనితో, ప్రస్తుతం ఆరవల్లి-నిడదవోలు మధ్య 35 కిమీల కొంత భాగం మినహా ప్రాజెక్టు మొత్తం డబుల్‌ లైన్‌తో నిర్వహించబడుతుంది.
విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్‌, గుడివాడ-మచిలీపట్నం & నర్సాపూర్‌-నిడదవోలు డబ్లింగ్‌ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య ఈ సెక్షన్‌లో విద్యుదీకరణతో సహా డబ్లింగ్‌ లైను ప్రారంభమైంది. రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 221 కిమీల దూరం గల ఈ ప్రాజెక్టు 2011-12 సంవత్సరంలో మంజూరైంది మరియు ఆర్‌విఎన్‌ఎల్‌ (రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌) వారిచే నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరియు దీనితో ఈ ప్రాంత అభివృద్ధికి బలోపేతం చేకూరుతుంది.
మొత్తం 221 కిమీల పొడవుగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 186 కిమీల మేర పనులు పూర్తయ్యి ప్రారంభించబడిరది. 35 కిమీల దూరం గల ఆరవల్లి ` భీమవరం టౌన్‌ సెక్షన్‌లో మిగిలిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరియు అవి చివరి దశలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుతో ప్రయోజనాలు
-ఈ ప్రాజెక్టుతో సరుకు రవాణా మరియు ప్రయాణికుల రాకపోకలు నిరాటంకంగా సాగడం ద్వార రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో మరియు అనుసంధానంలో గణనీయమైన పటిష్టత చేకూరుతుంది.
-నూతన డబుల్‌ రైల్వే లైను ద్వారా రైలు రవాణా మెరుగవుతుంది మరియు రైలు రవాణాకు సంబంధించి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.
-ఈ ప్రాంతంలోని వనరులైన వ్యవసాయ మరియు ఆక్వా ఉత్పత్తుల రవాణా సులభతరమవడంతో ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.
-విద్యుదీకరణ పనులతో కార్బన్‌ ఉద్గారాలు తగ్గడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది మరియు ఇంధన ఖర్చు తగ్గుతుంది.
-ఈ లైను ద్వారా విజయవాడ-విశాఖపట్నం మధ్య కోస్తా రైల్‌ కారిడార్‌ కోసం అనుకూలమైన ప్రత్యామ్నాయ రైల్వే లైనుగా సేవలందించవచ్చు.
ఆరవల్లి-భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ సెక్షన్‌ మధ్య విద్యుదీకరణతో సహా డబుల్‌ లైన్‌ ఏర్పాటుకు కృషి చేసిన విజయవాడ డివిజన్‌ & ఆర్‌విఎన్‌ఎల్‌ అధికార, సిబ్బంది బృందాలన్నింటినీ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ కిశోర్‌ అభినందించారు. ప్రాజెక్టులో మిగిలిన భాగాలలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జనరల్‌ మేనేజర్‌ వారికి సూచించారు. కీలకమైన ఈ డబ్లింగ్‌ లైన్‌ పనులతో ప్రయాణికులకు నిరాటంక రాకపోకలను కల్పించడమే కాకుండా తక్కువ రవాణా ఖర్చుతో ఇక్కడి ఉత్పత్తులను నూతన ప్రాంతాలలో మార్కెటింగ్‌ చేసుకునేందుకు అపారమైన అవకాశాలుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *