విశాఖపట్నం,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంను సందర్శించారు. గవర్నర్ దంపతులకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కార్యనిర్వహణాధికారి ఎం.వి. సూర్యకళ తదితరులు ఆలయ మర్యాదలతో సంప్రదాయరీతిన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Prajavartha Online Telugu News