Breaking News

ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన సీఎం జగన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
జలవనరుల శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం జగన్ పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పోలవరం ప్రాజెక్టులో పునరావాసాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. డీబీటీ పద్దతుల్లో ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం దిగువ కాఫర్‌ డ్యామ్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ అంశాలపై సమీక్షలో చర్చించారు. డౌన్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ అన్ని డిజైన్లు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జులై 31 కల్లా పని పూర్తవుతుందని వివరించారు. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం జ‌గ‌న్ అధికారులకు సూచించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.. మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్నారు. దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పోలవరం సహా ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయాలి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ డిజైన్లు త్వరలో ఖరారవుతాయి. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలి. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేరు నోటిఫై చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దృష్టిపెట్టాలి. మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లాలి. కెనాల్‌కు భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో జ‌లవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *