గణపవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గణపవరం మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఇందుకూరు రామకృష్ణ రాజు తో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా ప్రతి ఒక్కరితో కలిసే మంచితత్వం రామకృష్ణం రాజు నుంచి గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా ఇందుకూరు రామకృష్ణం రాజు ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి తానేటి వనితను రామకృష్ణ రాజు శాలువా తో ఘనంగా సన్మానించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల కి అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో తనదైన ముద్ర వేశారని ఆయన అభినందించారు.
Prajavartha Online Telugu News