Breaking News

రైల్వే స్టేషన్ లో కూలింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ధిక న్యాయానికి పునాదులేసిన జకాత్ అనే పవిత్ర కార్యం ద్వారా నిరుపేదలను ఆదుకోవడంలో కలిగే ఆనందం మరే కార్యం ద్వారా లభించదని, ఖురాన్ బోధకులు సైది ముర్షిది షా హుజూర్ ఆల్ హజ్ ముఫ్తి అబ్దుల్ హలీం సాహెబ్ ఎన్నో అమూల్య వచనాలు అత్యంత అనుసరణీయమని, రాష్ట్రవ్యాప్తంగా వారిచే నిర్వహించబడే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అమూల్యమైనవని మాజీ మంత్రి , మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ సమీపంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సురక్షితమైన చల్లని నీటిని అందించే ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముస్లీమ్ సాంప్రదాయాలు , మెరుగైన జీవన విధానాలు, పవిత్ర ఖురాన్ లోని వచనాలు ఆధ్యాత్మిక బోధనలు మన జీవన విధానానికి ఎలా అన్వయించుకోవచ్చో చక్కగా విశదీకరించడమేకాక పలువురిచేత ఆచరింపచేసే హుజూర్ ఆల్ హజ్ ముఫ్తి అబ్దుల్ హలీం తన లాంటివారికి సైతం ఎంతో ప్రేరణ కలిగిస్తున్నాయన్నారు. ఆయన చూపిన దైవభక్తి మార్గంలో ఉత్తేజితులైన పహిల్వాన్ ఖాన్ కుటుంబసభ్యులు హుజూర్ ఆల్ హజ్ ముఫ్తి అబ్దుల్ హలీం పేరిట ఈ వసతి ప్రయాణికులకు కల్పించడం సంతోషమన్నారు.
ఈ కార్యక్రమంలో ముఫ్తి యాహ్యా రజా సాహెబ్ ( ముంబై ), హఫీజ్ షాబుద్దీన్ సాబ్ ( బీహార్ ) , మోవలానా హోస్ మొహిద్దీన్ సాహెబ్ ( కాకినాడ ) , మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మాజీ మునిసిపల్ ఛైర్మెన్, పట్టణ వైస్సార్ సి పి అధ్యక్షులు షేక్ సలార్ దాదా, 12 వ డివిజన్ పార్టీ ఇంచార్జ్ బందెల థామస్ నోబుల్, 19 వ డివిజన్ పార్టీ ఇంచార్జ్ బూరుగ రామారావు, షేక్ సాహెబ్, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, మచిలీపట్నం రైల్వే స్టేషన్ మేనేజర్ యువ నాగేశ్వరావు, కమర్షియల్ సూపర్వైజర్ అమీర్, సెక్షన్ ఎలెక్ట్రిక్ ఇంజినీర్ సప్త గిరీష్, మహమ్మద్ భాషా, పల్లె శేఖర్, గాజుల భగవాన్, శేషయ్య పలువురు కార్పొరేటర్లు, ముస్లీమ్ మత పెద్దలు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *