అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖా మంత్రిగా గుమ్మనూరు జయరాం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈమేరకు బుధవారం ఉదయం 9.గం.లకు అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ చంద్ర శేఖర్ వర్మ,రాష్ట్ర బాయిలర్ల డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు,గుంటూరు జిల్లా సహాయ లేబర్ కమీషనర్ సుభాని తదితరులు మంత్రికి పూలగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంకా ఈకార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …