విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ 97 వ వార్షిక సమావేశం ఈ నెల 11 మరియు 12 వ తేదీ లలో ఉజ్జయినీ లో నిర్వహించటం జరిగింది. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి, సహేతుకమైన కోర్కెల సాధనకు జాతీయ స్థాయిలో చర్చించటం జరిగింది. రైల్వేలు 2021-22 సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం ఆర్జించినప్పటికి కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించటాన్ని ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శివ గోపాల మిశ్రా ఎండగట్టారు. Kovid-19 సందర్భముగా అహర్నిశలు పనిచేసి దేశ అవసరము లను తీర్చినప్పటికి రైల్వే కార్మికుల న్యాయ బద్దమైన కోర్కెలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోవటం అన్యాయ మని పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సహేతుకమైన ఈ క్రింది డిమాండ్స్ లను వెంటనే అమలు చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
1. రైల్వే కార్మికులను నూతన పెన్షన్ విధానం నుండి మినహాయించాలని కోరారు.
2. ఏడవ వేతన సంఘం పేర్కొన్న కనీస వేతనాన్ని మరియు fitment ను మెరుగు పర్చాలని కోరారు
3. 150 రైళ్ళను, 109 రైల్వే రూట్ లను ప్రైవేటీకరణ ను విరమించాలి.
4. రైల్వే ఉద్యోగులకు, పెన్షణార్లకు నిలిపి వేసిన 3 విడతల DA బకాయిలను వెంటనే చెల్లించాలి.
5. రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించుటకు 7000 పరిమితి కాకుండా నిజ వేతనాన్ని పరిగణన లోకి తీసుకుని బోనస్ ను చెల్లించాలి.
6 నైట్ డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరికీ బేసిక్ పే తో నిమిత్తం లేకుండా నైట్ డ్యూటీ అలవెన్సును చెల్లించాలి.
7. అన్ని రకాల సేఫ్టీ కేటగిరీ ఉద్యోగులకు రిస్క్ ఆలవెన్సును చెల్లించాలి.
8.సీనియర్ సూపర్వైజర్ లకు గ్రూప్ బి హోదా కల్పించి 4800 మరియు 5400 గ్రేడ్ పే చెల్లించాలి.
9. పాయింట్స్మన్ కేటగిరీ లో 4200 గ్రేడ్ పే పదోన్నతులు కల్పించాలి.
10. అన్ని విభాగాల లోని 1800 గ్రేడ్ పే వారిలో 50%మందికి 1900 గ్రేడ్ పే అమలు చేయాలి.
11. ప్రింటింగ్ ప్రెస్ ల ప్రైవేటీకరణ ను ఆపాలి.
12. అన్ని విభాగాల్లో DR కోటా ఖాళీలను GDCE విధానము ద్వారా అందరూ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి.
13. రైల్వే లో 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలి.
14. రన్నింగ్ సిబ్బంది మైలేజ్ లో ఎలాంటి సీలింగ్ లేకుండా 70 శాతం మొత్తాన్ని income-tax నుంచి మినహాయించాలని కోరారు.
15. అన్ని విభాగాలలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక టాయ్లెట్ కు, విశ్రాంతి గదులు వంటి కనీస అవసరము లను కల్పించాలి.
16. రైల్వే ఆసుపత్రులలో పని చేసే అందరికీ పేషంట్ కేర్ అలవెన్సులు చెల్లించాలి.
17. రైల్వే సిబ్బంది అందరికీ మూడు సెట్ల ac తరగతి పాసులు ఇవ్వాలి
18. రన్నింగ్ సిబ్బందికి MACP ద్వారా 4600 మరియు 5400 గ్రేడ్ పే కల్పించాలి.
19. SALUTE పథకం ద్వారా అన్ని విభాగాల లోని సేఫ్టీ ఉద్యోగులకు పదవీ విరమణ కల్పించి వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
20. రైల్వే ట్రాక్ పరిరక్షణకు ఇద్దరు నైట్ పెట్రోల్ మన్ లను ఏర్పాటు చేయాలి
ఈ ముఖ్యమైన డిమాండ్స్ అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ కోశాధికారి గా చొడవరపు శంకర రావు పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆహార్నిసలు పోరాడే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శంకర రావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి నందుకు రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే కార్మికులు హర్షం ప్రకటించారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నందు కమిటీ మెంబర్ నుండి ప్రెసిడెంట్ వరకు మరియు జనరల్ సెక్రటరీగా అన్ని హోదాలలో గత 56 సంవత్సరము లుగా కార్మిక ఉద్యమములో మమేకమైన మహా నేత డాక్టర్ శంకర రావు కి ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ కోశాధికారి గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భముగా వారికి తెలుగు రాష్ట్రాల లోని రైల్వే కార్మికులు శుభాకాంక్షలు తెలియ చేశారు. రైల్వే కార్మికుల సహేతుక డిమాండ్స్ అన్నింటినీ సాధిస్తామని ఈ సందర్భంగా కామ్రేడ్ శంకర రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి విజయవాడ డివిజన్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి జీ ఎన్ శ్రీనివాస రావు, వైస్ ప్రెసిడెంట్ లీల మరియు డివిజన్ స్థాయి నాయకులు అందరూ పాల్గొన్నారు.