విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి, ప్రేమలను ప్రజలందరికీ పంచడానికే క్రీస్తు అవతరించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని బైబిల్ మిషన్ చర్చి నందు జరిగిన గుడ్ ఫ్రై డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లోక రక్షకుడుకైన యేసు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. క్రీస్తు బోధనలు, సందేశాలు ఆచరణీయమైనవని.. ప్రేమ, శాంతిసందేశాలు, ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో ప్రపంచానికి తెలియచెప్పేందుకు ఆ కరుణామయుడు తన రక్తం చిందించారన్నారు. నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారని.. ప్రపంచానికి శాంతి మార్గం చూపారన్నారు. ఆ దేవుని కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని మతాలు, వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిథ్యం ఇస్తూ.. అన్ని పండుగలు, సంప్రదాయాలను సరిసమానంగా చూస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభువు కృపతో జగనన్న నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని కాంక్షించారు. కార్యక్రమంలో 29 వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మిపతి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఉమ్మడి వెంకట్రావు, పాస్టర్ దాస్ బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …