Breaking News

రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడదల రజని

-ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతాం

అమరావతి, ఏఫ్రిల్ 18 :
రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా విడదల రజని సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు భర్త, పిల్లలతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వైద్య నిపుణులకు రూ.85 వేల వరకు జీతాలు పెంచుతూ తొలి సంతకం ఆమె చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా గొప్ప బాధ్యతలను తనకు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యాలు, ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలోని నిరుపేదలకు అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా అడుగులు వేస్తానన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజక వర్గంలో ఒక వైద్య కళాశాల చొప్పున రాష్ట్రంలో పదహారు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుచున్నదన్నారు. అయితే అన్ని వైద్య కళాశాలల నిర్మాణ పనులన్నీ వచ్చే నెలాఖరులోపు ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. నాడు-నేడు పథకం అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపర్చడం జరుగుచుడంతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది పోస్టులన్నింటీ పెద్ది ఎత్తున భర్తీ చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తున్నదని, టెలీమెడిసిన్ సేవలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతగానో అభినందించడం ఇందుకు నిదర్శనం అన్నారు. క్యాన్సర్ పై ప్రత్యేకించి మహిళల్లో ప్రభలుతున్న క్యాన్సర్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని, ఈ అవగాహన కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరియు దీనికి సంబందించిన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు పరుస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు కృషిచేస్తానన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తూ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా కృషిచేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని ఆమె అన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇతర అధికారులు, అనధికారులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని కి పుష్పగుచ్చాలు అందజేసి అభినందలు తెలిపారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *