విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం నేపధ్యంలో నమాజు సమయాల్లో మసీదుల్లో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని, మసీదుల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, మంచినీరు నిరంతరం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంతోషకర వాతావరణంలో పండగ చేసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, అమీన్ భాయ్, మరియు రాష్ట్ర నాయకులు మేక వెంకటేశ్వర రావు కోరారు. ఈ విషయమై శనివారం విడుదల చేసిన ప్రకటనలో అమీన్ భాయ్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలుపైన, సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైనా అల్లాహ్ దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. నగరంలో కరోనా సమయం నుండి ఇప్పటివరకు ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామన్నారు. అన్నదానాలకు, పేద, మధ్య తరగతి కుటుంబాలలోని కొందరు క్యాన్సర్ బాధితులకు, యాక్సిడెంట్ వల్ల ఇబ్బందులు కలిగి చికిత్స చేయించుకునే స్థోమత లేనివారికి ఆర్ధిక సహాయం, మసీదులు, గుళ్ళు, చర్చి నిర్మాణానికి, రిపేర్లకు చేతనైనంతలో ఆర్ధిక సహాయాన్ని మిత్రుల సహాయం ద్వార చేస్తున్నామన్నారు. సమాజ సేవే దేవుని సేవ అని నమ్ముతున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవాకార్యక్రమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …