Breaking News

ఎపిని పర్యాటక రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు చేపట్టాలి : మంత్రి రోజా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక పరంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,క్రీడల శాఖామంత్రి ఆర్కె రోజా చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె పర్యాటక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదని సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు.కేవలం తీరప్రాంతాలే కాకుండా ఏజెన్సీలోనూ అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాలు,టెంపుల్ టూరిజం ప్రదేశాలకు పెట్టింది పేరని అన్నారు.అంతేగాక సహజసిద్ధ జలపాతాలు,ఏడాది పొడవునా పారే వాగులు మన రాష్ర్టానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే మొదటి స్ధానంలో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి రోజా అధికారులను ఆదేశించారు.
పర్యాటకుల రద్దీకి తగ్గట్టుగా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచాలని అధికారులను మంత్రి రోజా ఆదేశించారు.విశ్రాంతి గదులు,పార్కులు,మరుగుదొడ్లు,దుస్తులు మార్చుకునే సదుపాయాలు,మహిళలకు ప్రత్యేక వసతులు అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం అందించే నిధులను సమీకరించే విధి విధానాను రూపొందించాలని అన్నారు.ఈ సందర్భంగా సెంట్రల్ పైనాన్షియల్ అసిస్టెన్స్ నిధుల మంజూరు,స్వదేశ్ దర్శన్,ప్రసాద్ స్కీమ్స్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కూడా ఆమె సమీక్షించారు.కాకినాడ,నెల్లూరు కోస్టల్ సర్కూట్ మరియు బుద్దిస్ట్ టూరిజం సర్కూట్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు కావల్సిన ప్రాజెక్టు అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.పైప్ లైన్ దశలో వున్న టెంపుల్ కనెక్టివిటీ టూరిజం అభివృద్దిపై మంత్రి రోజా సమీక్షించారు.మన రాష్ర్టంలో పర్యాటక భవన్,తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్,విశాఖపట్నంలో ఇండియా టూరిజం ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాల్సిందిగా అధికారులను అదేశించారు.
రాష్ట్రంలోని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో సంరక్షిస్తున్నప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మ్యూజియం గ్రాంట్స్ తో మరింత అభివృద్ది పరచాలని ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వ నిధులను సేకరించి మ్యూజియంల డిజిటలైజ్,ఆధునీకరణ చేయడానికి డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి రోజా అధికారులను ఆదేశించారు.రాజమండ్రి, మైలవరం,పెనుకొండ,కడప, కాకినాడ,కర్నూలు,గుంటూరు,విశాఖపట్నం,శ్రీకాకుళం,విజయనగరాల్లో నూతనంగా మ్యూజియంల ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.చారిత్రక కట్టడాలను సంరక్షించి భావితరాలకు ఆస్తిగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.ఇందుకు రాష్ర్ట మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి నిధులను సమీకరించి అభివృద్ది పనులు చేపట్టాలని మంత్రి రోజా ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుండి పెండింగ్ లో వున్న సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్,ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, పర్యాటక సంస్థ ఎండీ కన్నబాబు,ఆర్కియాలజీ శాఖ కమిషనర్ జి.వాణీ మోహన్ ఇంకా ఆర్కియాలజీ,కల్చరల్ డిపార్టుమెంట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *