-వేసవి సెలవులు పూర్తయ్యేలోగా అన్ని బిసి వసతిగృహాలకు మరమ్మత్తులు
-వసతిగృహ ప్రాంగణాల్లో పెద్దఎత్తున మొక్కలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం
-నెడ్ క్యాప్ సహాయంతో బిసి వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ సౌకర్య కల్పనకు చర్యలు
-విద్యార్దులకు రుచికరమైన నాణ్యతగల ఆహారాన్ని అందించేందకు కుక్కులకు శిక్షణ
-రాష్ట్ర బిసి సంక్షేమం,సమాచార శాఖామంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత వేసవి సెలవులు పూర్తయ్యేలోగా రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ,ప్రవేట్ భవనాల్లోని బిసి సంక్షేమ వసతి గృహాలకు మరమ్మత్తులు నిర్వహించి వసతి గృహాలన్నిటినీ పూర్తి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర బిసి సంక్షేమం మరియు సమాచార పౌర సంబంధాలు,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెప్పారు.మంగళవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు మంత్రి చాంబరులో బిసి సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమావేశమై బిసి వసతి గృహాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం బిసి సంక్షేమ వసతి గృహ విద్యార్ధులకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఈవేసవిలో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా,ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లో 25 ప్రాంతాల్లో బిసి వసతి గృహాల వంట మనుషులకు (కుక్కులు)శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నబిసి సంక్షేమ వసతి గృహాలు,బిసి సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలలను మరింత తీర్చిదిద్ది విద్యార్ధులకు ఏవిధంగా ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కలిగించాలనే దానిపై ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఆయన ఆలోచనలకు అనుగుణంగా వసతి గృహాలను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.అన్ని బిసి వసతి గృహాల ప్రాంగణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించి డ్రిప్ విధానంలో వాటికి నీరందించి సంరక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వెంటనే అమలు చేయడం జరుగుతుందని మంత్రి వేణు గోపాల కృష్ణ చెప్పారు.
జగన్ అంటే నిజం… జగన్ అంటే ప్రతి కుటుంబానికి ఒక భరోసా…
గడప గడపకు మీ ప్రభుత్వం కార్యక్రమంపై మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ గత మూడేళ్ళుగా ఈప్రభుత్వం ప్రజలకు మరీ ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఏమి చేసిందనేది తెలియజేయడమే ఈకార్యక్రమం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.ఏగడపకు వెళ్ళినా ఆఇంటికి ఏఏ పధకాల ద్వారా ఏలబ్ది కలిగిందని చెప్పడమే ఈకార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు.అనగా జగన్ అంటే నిజం అని నాడు అన్నానని ఈమూడేళ్ళు ఆయన పాలన చూసిన తర్వాత నేడు అంటున్నానని జగన్ అంటే ఒక భరోసా అని పేర్కొన్నారు.భరోసా అంటే ఎలాగంటే రైతులకు రైతు భరోసా,చేనేత కార్మిక కుటుంబాలకు చేనేత భరోసా అని,పిల్లలను బడికి పంపే తల్లికి అమ్మఒడి ఒక భరోసా అని,పాఠశాలలు,కళాశాలలకు వెళ్ళే విద్యార్దులకు విద్యా దీవెన, విద్యాకానుక ఒక భరోసా అని పేర్కొన్నారు.అంతేగాక బాల్యంలో ఉన్న పిల్లలకు గోరుముద్ద ఒక భరోసా అని,వృద్ధులకు ఫించన్ కానుక ఒక భరోసా అని,నాడు-నేడు కార్యక్రమం చూశాక పాఠశాలలకు వెళ్ళే విద్యార్దులు ఆపాఠశాలలో చదవాలనేది ఒక భరోసా అని పేర్కొన్నారు. ఇవన్నీచూశాక నాడు-నేడు అన్నది జగన్ అంటే నిజమని నేడు నేను చూస్తున్నది జగన్ అంటే భరోసా అని జగన్ అంటే ఒక బ్రాండింగ్ అని సగుటు సామాన్యుని జీవితానికి ప్రభుత్వం ఒక భరోసా అయితే అది సియం జగనే అని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
అంతకు ముందు జరిగిన బిసి సంక్షేమ వసతిగృహాల సమీక్షలో బిసి సంక్షేమశాఖ కమీషనర్ అర్జునరావు,బిసి రెసిడెన్సియల్ పాఠశాలల సొసైటీ కార్యదర్శి కృష్ణ మోహన్,బిసి సంక్షేమశాఖ జెడి చిన్నబాబు,ఇతర అధికారులు పాల్గొన్నారు.