Breaking News

ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు

-రాష్ట్రంలో వైద్య విధానం పూర్తిగా మారుతోంది
-ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌న్న ల‌క్ష్యం
-ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి
-న‌కిలీ మందుల‌పై ఉక్కుపాదం మోపండి
-నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం
-అవినీతి లేని పాల‌న జ‌గ‌న‌న్న ల‌క్ష్యం
-లైసెన్సుల జారీ, రెన్యువ‌ల్ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలి
-డ్ర‌గ్స్ విభాగం సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. రాష్ట్రంలోని డ్ర‌గ్స్ విభాగం అధికారులంద‌రితో క‌లిసి గురువారం మంత్రి సెక్రటేరియ‌ట్ లో విస్తృత‌స్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ విభాగం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను ఆమె ఈ సంద‌ర్భంగా సిబ్బందికి వివ‌రించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో న‌కిలీ మందుల ఊసే త‌లెత్త‌కూడ‌ద‌న్నారు. అన్ని మందుల షాపులను నిరంత‌రం త‌నిఖీలు చేస్తూనే ఉండాల‌ని చెప్పారు. న‌కిలీ మందుల త‌యారీ, అమ్మ‌కం… లాంటి చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌లు ఎక్క‌డ జ‌రుగుతున్నా ప‌సిగ‌ట్టేలా డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు ప‌నిచేయాల‌ని చెప్పారు. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. కాలం తీరిన మందులు ఎక్క‌డా క‌నిపించ‌రాద‌ని చెప్పారు. ప్ర‌తి డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తి నెలా క‌నీసం 50కిపైగా మెడిక‌ల్ షాపుల‌ను త‌నికీ చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌ని తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారి లైసెన్సులు ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్ల‌డ్ బ్యాంకుల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయ‌ని, అలాంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించ‌ని బ్ల‌డ్ బ్యాంకులను గుర్తించాల‌న్నారు. ర‌క్త‌నిల్వ‌లు, ప్లేట్ లెట్స్ లాంటి వాటిని ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌ల‌కే మాత్ర‌మే అమ్మేలా చూడాల‌ని చెప్పారు. అధిక ధ‌ర‌ల‌కు కొంత‌మంది ర‌క్త‌పు నిల్వ‌లు అమ్ముకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తి బ్ల‌డ్ బ్యాంకులో ధ‌ర‌ల ప‌ట్టిక ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. అన్ని బ్ల‌డ్ బ్యాంకుల్లో డ్ర‌గ్స్ విభాగం ప‌ర్య‌వేక్ష‌ణ పూర్తి స్థాయిలో ఉండాల‌ని చెప్పారు. ర‌క్త సేక‌ర‌ణ‌, నిల్వ కేంద్రాల్లో న‌ర్సుల స్థానంలో ల్యాబ్ టెక్నీషియ‌న్ల‌ను వినియోగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని, ఇలా జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌లు లేకుండా ఇష్టానుసారంగా క్లినిక‌ట్‌ట్రైల్స్ నిర్వ‌హంచే వారిపై ఓ క‌న్నేసి ఉంచాల‌న్నారు.

నిజాయితీగా ప‌నిచేయండి
రాష్ట్రంలోని డ్ర‌గ్ విభాగం అధికారులంతా నిజాయితీగా ప‌నిచేయాల‌ని చెప్పారు. నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌కు త‌మ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. లైసెన్సుల జారీ, రెన్యువ‌ల్ లాంటి విష‌యాల్లో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. మందుల త‌యారీ కంపెనీల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేలా చొర‌వ చూపాల‌న్నారుర‌. డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు చొర‌వ‌చూపితే త‌క్కువ ధ‌ర‌ల‌కే మందులుప్ర‌జ‌ల‌కు అందించే వీలు ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. కొన్నిషాపులు రాయితీకి మందులు విక్ర‌యిస్తుంటార‌ని, వారికి వీలైన‌ప్పుడు మిగిలిన షాపుల‌కు ఎందుకు వీలు కల‌గ‌కుండా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌న‌రిక్ మందుల షాపుల సంఖ్య‌ను పెంచేలా మ‌న ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంద‌ని తెలిపారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి
డ్ర‌గ్ విభాగం అధికారులు రీజ‌న‌ల్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు వాహ‌నాల కేటాయింపు లాంటి కొన్ని స‌మ‌స్య‌లు మంత్రి ముందుకు తీసుకురాగా.. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి కృషి చేస్తాన‌ని బ‌దులిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను ప్రాధాన్య అంశంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిగా భావిస్తున్నార‌ని, ఈ శాఖ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని వైద్య విధానాన్ని ఏపీలో నెల‌కొల్పే దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ముందుకు వెళుతున్న‌ద‌ని చెప్పారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *