విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ లోని ప్రియదర్శిని కాలనీ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ ను మాజీమంత్రి, ఎన్.టి.ఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, స్టాండింగ్ కమిటీ సభ్యులు పడిగపాటి చైతన్య రెడ్డి, కార్పొరేటర్లు, మరుపిళ్ల రాజేష్, ఇర్ఫాన్, యారడ్ల ఆంజనేయ రెడ్డి, యలకల చలపతిరావు, గుడివాడ నరేంద్ర రాఘవ వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …