-కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి
-ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ పై నెట్టాడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నా…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు కోరారు.