విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమలాపురంలో ఆందోళనకారులు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నేడు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేశారు. ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలేగాని, ఇటువంటి దాడులకు పాల్పడటం సరైంది కాదు. ఇటువంటి దాడులు సామాజిక ప్రయోజనాలకు విఘాతం. దాడులకు తెగబడ్డ వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …