విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేడ్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని మాలమహనాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విజనలో బాగంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం నామకరణం చేయడం హర్షంచదగ్గ విషయమన్నారు. పేరు ఉండకూడదని కొనసీమ లో అల్లర్ల కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధినగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుని ప్రభుత్వం కోనసీమ జిల్లాకు పెట్టడం హర్షించదగ్గ నిర్ణయమని అన్నారు. ఆ పేరు ఉండకూడదని కొంతమంది మతోన్మాదులు, అరాచక శక్తులు కలసి రాష్ట్ర మంత్రి ఇల్లు, శాసన సభ్యుని ఇల్లు దగ్ధం చేయటం హేయమైన చర్య అని ఎవరైతే ఇంతటి దారుణానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో రెండు రాష్ట్రాల్లో ఉండే మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఎన్.పుష్ప రాజ్, తెలంగాణ రాష్ట్రప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్, దాసరి సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా యూత్ అధ్యక్షులు గుండె సురేష్, జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, సహాయ కార్యదర్శి కె.ప్రసాద్, సాకబాబు రాజేంద్ర ప్రసాద్, గుండె రాంపండు, మాలమహనాడు నేతలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News