అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ కు సంభందించిన దస్త్రం ఫై ముఖ్యమంత్రి సంతకం చేస్తూ లక్ష ముప్ఫయి వేల మంది సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపడం జీవితంలో మరువలేని మధుర ఘట్టం అని తెలియజేసారు. జీవితంలో తరతరాలకు మేలు చేస్తూ జీవితాలకు భరోసానిస్తూ విమర్శించిన వారి నోటికి తాళం వేసేలా మరువలేని మేలు చేసిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి ఫెడరేషన్ తరపున కృతజ్ఞతగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతను అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు అందరూ ముఖ్యమంత్రివర్యుల ఆశయాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అవినీతి రహిత సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించడంకోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం,శ్వేతా,రాజేష్,సుభాని,మనోహర్, ప్రమీల,రామకృష్ణ రెడ్డి,కమలాకర్,అర్చన తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …